Wednesday, March 18, 2026

బి, ఆ ర్. ఏ స్ నుండి బిజెపిలో చేరిక

నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ మానకొండూర్ నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి గన్నేరువరం గ్రామ 6 వ వార్డ్ సభ్యులు టేకు అనిల్ గారు వారితోపాటు 20 మంది సభ్యులు బుధవారం నాడు భారతీయ జనతా పార్టీ బిజెపి మండల అధ్యక్షులు తిప్పర్తి నికేష్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాపాలన పేరిట ఉత్సవాలు నిర్వహించడాన్ని రెండేళ్లలో ప్రభుత్వం చేసింది ఏమీ లేదని రెండేళ్లలో ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుందని మాయ మాటలు వాగ్దానాలన్నీ నీటి మూటలేనని విమర్శించారు అనేక అభివృద్ధి కార్యక్రమాల కు కేంద్రమే పెద్ద ఎత్తున నిధులు ఇస్తుందని తెలిపారు ప్రజలను మభ్యపెట్టి ప్రయత్నం చేస్తుందన్నారు మండల అభివృద్ధికి బండి సంజయ్ కుమార్ కట్టుబడి ఉన్నారని ప్రధానంగా గన్నేరువరం మండల వాసుల చిరకాల వాంఛ మానేరు నది పై వంతెన నిర్మాణం కోసం కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఎంతో కృషి చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు మచ్చ బాలరాజు సంధ్య వేణి ప్రశాంత్ యాదవ్ జాలి శ్రీనివాస్ రెడ్డి 8 వ వార్డ్ సభ్యులు మచ్చ సాయికృష్ణ మధుకర్ రెడ్డి పుల్లెల జగన్ కుర్ర హరీష్ బోయిని వేణు తదితరులు పాల్గొనడం జరిగింది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News