Wednesday, March 18, 2026

గోవిందాపూర్ ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రంలో వరి దొంగతనం2 ఎకరాల వరి అక్రమ తరలింపు ఆరోపణతో రైతు భుక్య శారద ఆవేదన

నేటి సాక్షి, నల్లబెల్లి డిసెంబర్ 17 : ఐకెపి సెంటర్ ( ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రం )లో అమ్మకానికి వచ్చిన వరి ధాన్యం కుప్పలో నుంచి వడ్లు దొంగతనం జరిగిన సంఘటన గోవిందపురంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన ప్రకారం నల్లబెల్లి మండలం గోవిందాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రంలో వరి అమ్మకానికి తెచ్చిన వడ్లు ఒక రాశిగా పోసి ఎండబెట్టే తరుణంలో కష్టపడి పండించిన వడ్లను గుర్తుతెలియని వ్యక్తులు డిసెంబర్ 16 రాత్రి కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన త‌న రాసి కుప్పలో నుంచి 2 ఎకరాల వడ్లను గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా తరలించినట్లు భుక్య శారద స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాత్రివేళ కొందరు వ్యక్తులు వరి సంచులు వాహనంలో లోడ్ చేస్తున్నట్లు గ్రామస్తులు గమనించినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఘటనతో తన కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడిందని, సాగు కోసం తీసుకున్న అప్పులు ఎలా తీర్చాలో అర్థంకావట్లేదని భుక్య శారద వేదన వ్యక్తం చేశారు. తక్షణమే దోషులను గుర్తించి, తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి. ఉన్నతాధికారులకు, ప్రజా ప్రతినిధులను న్యాయం చేయాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News