Wednesday, March 18, 2026

*ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల విద్యాభివృద్ధికి దాతలు సహకరించండి: చిన్నబాబు*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం*ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు వారి విద్యాభివృద్ధికి దాతలు సహకరించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కమిటీ డైరెక్టర్ చిన్నబాబు అన్నారు బుధవారం చేకూరి నాగమ నాయుడు యర్రమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సొసైటీ ఫర్ సోషియల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 10 వ తరగతి విద్యార్థుల అవసరాలను గుర్తించి సొంత ఖర్చులతో పరీక్షలకు ఉపయోగపడే ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్సిల్స్, పెన్లు తదితర స్టేషనరీ సామగ్రిని ఉచితంగా వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యే భవిష్యత్తుకు పునాది అనే నమ్మకంతో విద్యార్థులకు అవసరమైన మౌలిక సహాయం అందించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నామని పిల్లల అభివృద్ధే లక్ష్యంగా, సేవా భావంతో ముందుకు సాగుతున్నామని దూర ప్రాంతాల నుండి తల్లితండ్రులను బంధువులను వదిలి విద్య కోసం ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు అవసరమైన విద్యా సామాగ్రిని అందించిన సొసైటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం అభినందించారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు తోడుగా ఉన్నామన్న ధైర్యం వాళ్లలో కలుగుతుందని ఇలాంటి కార్యక్రమాలు వాళ్లలో గుర్తింపుగా నిలిచిపోయి ప్రేమగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షుడు మేకల తిరుమలరెడ్డి,సింగిల్ విండో చైర్మన్ చేకూరి జనార్థన్ చౌదరి, సీనియర్ నాయకులు కొట్టే నరసింహా రెడ్డి,మండల విద్యాశాఖాధికారులు మార్కండేయ నాయుడు జయ వేలు, ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News