నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం* మండలంలోని తిరుపతి –దేవలంపట రాష్ట్ర రహదారిలో ప్రసన్న వెంకటేశ్వరపురం ( పివిపురం ) నుండి కుప్పం బాదురు వరకు డబుల్ రోడ్డుపై చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి వెంకట మణి ప్రసాద్ ( నాని) చొరవతో తారు రోడ్డు నిర్మాణం చురుకుగా సాగుతున్నది. పీవీ నుండి నాలుగు కిలోమీటర్లు కుప్పం భాదూరు వరకు వర్షాలకు రోడ్డు గుంతల మయం కావడంతో వాహన చోదకుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉండేది. స్థానిక గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టికి తీసుకురావడంతో వెంటనే రోడ్లు భవనాల శాఖ అధికారులతో చర్చించి నిధులు మంజూరు చేయించారు. గుత్తేదారు బొల్లినేని శుభగిరి తారు రోడ్డు నిర్మాణాన్ని ఆర్ అండ్ బి ఏ ఈ ధనలక్ష్మి,, వర్క్ ఇన్స్పెక్టర్ చిరంజీవుల పర్యవేక్షణలో నాణ్యత ప్రమాణాలతో చురుకుగా సాగిస్తున్నారు. దీంతో వాహన చోదకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పులివర్తి నానికి కృతజ్ఞతలు తెలిపారు.





