నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 17 ~అన్నమయ్య జిల్లా -:- మండలాల్లోని ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలోని రక్షకభటుల నిరంతర కృషి ద్వారా నేరాల రహిత జిల్లాగా మార్చవచ్చని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్నారు. నేరాల రహిత జిల్లాగా మార్చడమే మా ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండల పోలీస్ స్టేషన్ సిబ్బంది గ్రామాల పరిధిలోని విద్యాసంస్థల్లో ఆ శాఖధికారులు సమైక్యతలో బుధవారం విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ‘డిజిటల్ అరెస్ట్’ బెదిరింపులకు భయపడవద్దని గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పకూడదని గుర్తు తెలియని వ్యక్తులు మొబైల్ ఫోన్లలో వివరాలు అడిగిన చెప్పొద్దని సూచించారు. వేధింపుల నివారణకు ‘శక్తి యాప్’ వాడకం, చిన్నపిల్లలపై అకృత్యాలను అరికట్టే ‘పోక్సో’ చట్టంపై, బాల్యవివాహాలపై ప్రజలను చైతన్యపరిచారు. మైనర్ డ్రైవింగ్‌పై నిఘా ఉంచామని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు తమ పరిధిలో ఏదైనా అనుమానాస్పద చర్యలు గమనిస్తే వెంటనే 112 నంబర్‌కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని అధికారులు కోరారు. మట్కా, కోడిపందాలు, గంజాయి, అక్రమ మద్యం, అక్రమ ఇసుక రవాణా, శ్రీగంధం తదితరాలపై నిరంతరం నిఘా ఉంటుందని డ్రోన్ ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని ఏ కేసులో చిక్కుకున్న బయటకు రావడం తద్యమని ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలంటూ పోలీసులు అవగాహన కల్పించారు. మీడియా కూడా ప్రత్యేక పాత్ర పోషించాలని సర్వహక్కులు మీడియాకు ఉన్నాయని కానీ మీరు చేతుల్లోకి తీసుకోకుండా మాకు తెలియజేయాలని మీడియా ముసుగులో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఓ ప్రకటనలో తెలిపారు..~~~~~~~~~~~~~~~~~~





