Wednesday, March 18, 2026

బహుజన సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నిక

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 17పుంగునూరు నియోజవర్గం చౌడేపల్లి మండలంలోని బహుజన సేవా సమితి రిజిస్ట్రేషన్ నెంబర్ 174/2024 నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా వ్యవస్థాపకులు గుండ్లూరు కృష్ణమూర్తి మాట్లాడుతూ బహుజన రాజ్యాధికారం సాధనలో భాగంగా ఎస్సి,ఎస్టీ,బిసి,మైనారిటీలందరిని కలుపుకోని, ఏకతాటిపై నడవడానికి ఈ సంస్థను ఏర్పాటుచేయడం జరిగిందని, ఈ సంస్థ పూర్తిగా ప్రపంచ మేధావి బాబాసాహేబ్ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సిద్దాంతాలకనుగుణంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. నూతన కార్యవర్గం లో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా గుండ్లూరు వేణుగోపాల్,ప్రధాన కార్యదర్శిగా శ్రీరాములు, చౌడేపల్లి మండలాధ్యక్షులుగా వసంతపల్లి చెంగల్రాయలు, కార్యదర్శిగా శేఖర్ బాబు, ఉపాధ్యక్షులుగా మునస్వామి, శెట్టిపేట శంకర, నరేష్, సంయుక్తకార్యదర్శిగా గడియారం శ్రీనివాస మూర్తి, ఖోశాధికారిగా శేఖర్, గంగాధర్, వెంకట్రమణ, గురుశేఖర్, సమీర్ భాషా, నరసింహులు, నారాయణ, గౌరవాధ్యక్షులుగా పొదలపల్లి రమణ ను ఏకగ్రీవంగా ఎనుకున్నారు.ఎన్నికకాబడిన వారు రెండు సంవత్సరాలు పదవికాలం లో ఉటారని, అందరూ బాబాసాహేబ్ సిద్దాంతాలను అభివృద్ధి బాటలో నడిపించాలని ప్రమాణం చేయించారు. ఎన్నికైన వారు వ్యవస్థాపకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News