నేటి సాక్షి. కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 17కొమురం భీం ఆసిఫాబాద్ కాగజ్ నగర్ పట్టణంలోవిశ్రాంత ఉద్యోగులు.ఈరోజు విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో విశ్రాంతి ఉద్యోగులు D.S.నకారే చిత్రపటానికి పూలమాలలంకరించి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి ఎం.జయదేవ అబ్రహాం అధ్యక్షులు మాట్లాడుతూ నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పింఛన్ దారులందరూ పెన్షన్ పొందుతూ ప్రశాంతమైన జీవితం గడుపడం వెనుక స్వర్గీయ ధరం స్వరూప్ నాకారా . చేసిన కృషి, కొనసాగించిన న్యాయ పోరాటం చిరస్మరణీయం. అంతేగాకుండా “పెన్షన్ అంటే భిక్ష కాదూ. ప్రభుత్వం ఇచ్చే దయా ధర్మం కాదూ.పెన్షన్ ఒక హక్కు, దానిని చెల్లించవలిసిన భాద్యత ప్రభుత్వాలదే.అనీ అద్భుతమైన తీర్పు నిచ్చి పెన్షనరలందరికి న్యాయం చేసిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ వై వీ చంద్రచూడ్. పెన్షన్ పొందుతున్న యావత్ పెన్షనర్లంరికీ చిరస్మరణీయులు, అట్టిహక్కును విశ్రాంత ఉద్యోగులందరూ కాపాడుకోవాల్సిన సమయము ఆసన్నమైనదని తెలిపినారు.ఇట్టి కార్యక్రమము లో కార్యదర్శి ఎం.శివ ప్రసాద్, రాజేంద్రప్రసాద్, అంకయ్య, అన్వర్ అహ్మద్, కె.నరసయ్య, మురళీధర్ రావు కె. పురుషోత్తం కుమార్ బి.నర్సయ్య, కిషన్ కుమార్ ch. రామయ్య మురారి, నారాయణ,శివలింగం, సలీం,v.రామయ్య,శంకర్ తదితరులు పాల్గొన్నారు.





