నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 18 ~అన్నమయ్య జిల్లా -:- స్థానిక నియోజకవర్గ పరిధిలోని బి.కొత్తకోట మండల కేంద్రమైన స్థానిక ఎంపీపీగా గురువారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాల మేరకు 11 మంది ఎంపీటీసీల సమన్వయంతో ఏకగ్రీవంగా ఎన్నికై రాధప్రదీప్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈమె పేరును ప్రతిపాదించిన బి. కొత్తకోట మాజీ ఎంపీపీ పాగొండ ఖలీల్ అహ్మద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి లకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని వాళ్ల ఆదరణతోనే ఎంపీపీ పదవి వరించిందని వీరి సహకారంతో ఎంపీటీసీల సమన్వయంలో బి. కొత్తకోట మండలాన్ని మరింత అభివృద్ధి బాటలో నడుపుతానని నూతన ఎంపీపీ రాధప్రదీప్ రెడ్డి తెలిపారు. మండల పరిషత్ అధ్యక్షురాలిగా రాధప్రదీప్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆమె మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో మండలంలోని ప్రధాన రంగాలైన వ్యవసాయం, ఇరిగేషన్, మహిళా సాధికారత కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెడతానని నా దృష్టికి ఏ సమస్య వచ్చినా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం చేస్తానని మాజీ ఎంపీపీ ఖలీల్ అహ్మద్ సమన్వయంలో అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యలను తీరుస్తానని రాధప్రదీప్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై పలువురు బి.కొత్తకోట వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఎంపీపీ కార్యాలయానికి విచ్చేసిన పలువురు వైసీపీ శ్రేణులు జడ్పీటీసీ రామచంద్ర యాదవ్, బీసీ సెల్ అధ్యక్షుడు సాంబశివ, కో ఆప్షన్ సభ్యులు నాసీర్, పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు షేక్ అయూబ్ భాష, సర్పంచులు రవి కుమార్ రెడ్డి, లక్ష్మీనారాయణ, జయ రెడ్డి, బూత్ కమిటీ అధ్యక్షుడు రెడ్డి హరి, యువ నాయకులు చిన్ని కృష్ణ, నక్క మహేష్, సబ్జి హరికృష్ణ, చాంద్ భాషా లు ఎంపీపీ రాధప్రదీప్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ దుశ్శాలువలు కప్పి పుష్పగుచ్చమందించి సన్మానించారు..~~~~~~~~~~~~~~~~~~





