నేటి సాక్షి,నారాయణపేట, డిసెంబర్ 18, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో ఉన్న బంగారు దుకాణాలను పరిశీ లించాలని నారాయణపేట జిల్లా సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు పి. వెంకటేష్ ఆధ్వర్యంలో మరికల్ మండల తాసిల్దార్ కు వినతి పత్రాన్ని గురువారం నాడు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ మరికల్ లో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి దుకాణాలను కొనసాగిస్తున్నారని ఆయన వివరించారు. ఇట్టి దుకాణాలకు ప్రభుత్వ లైసెన్సులను ఉన్నాయా లేవా అనే పరిశీలించాలని ఆయన కోరారు. బంగారు దుకాణాల వద్ద మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్నారు. రోజు వారి ధరల పట్టికను ఏర్పాటు చేయాలన్నారు. మరికల్ లో బంగారు దుకాణాలకు లైసెన్స్ లేని వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన తాసిల్దార్ని కోరారు.





