Wednesday, March 18, 2026

పత్రిక ప్రకటననేటి సాక్షి.కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాతేది:18/12/2025*రాజీ మార్గమే… రాజ మార్గం : జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐ.పి.ఎస్**ఈ నెల 21వ తేదీ వరకు జరుగనున్న “జాతీయ లోక్ అదాలత్”ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోగలరు.*వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవితకాలం కొనసాగుతాయి, ఒకవేళ ఇంతటితో కలిసుంటామని ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడే అవి సమసిపోతాయని, రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐ.పి.ఎస్ గారు జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లాలో వివిధ రకాల రాజీపడదగు కేసులలోని కక్షీదారులకు విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసారు. ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21 వ తేదీ వరకు ఆసిఫాబాద్, సిర్పూర్ (టీ) కోర్టులలో “జాతీయ లోక్ అదాలత్” సందర్భంగా కక్షీదారులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. మీపై కేసులు ఉంటే వాటిని రాజీ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులను పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుందని అన్నారు. యాక్సిడెంట్ కేసులు, వ్యక్తుల పై దాడి చేసే కేసులు, చీటింగ్ కేసులు, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్న చిన్న దొంగతనం కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మరియు ఇతర రాజీ పడదగు కేసులలో ఈ నేషనల్ లోక్ అదాలత్ లో రాజీ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చని ఎస్పీ గారు అన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని కేసులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరని కోరారు. దీనికోసం ఫిర్యాదు దారుడు మరియు నేరస్తులు అందరూ తమ యొక్క ఆధార్ కార్డు తీసుకుని సంబంధిత కోర్ట్/ప్రదేశంలో హాజరుకావాలని తెలిపారు. ఈ లోక్ అదాలత్ ను, వినియోగించుకోవాలనుకునేవారు సంబంధిత పోలీస్ స్టేషన్లలో లేదా కోర్ట్ కానిస్టేబుల్స్ ని సంప్రదించాలని అన్నారు. జాతీయ లోక్ అదాలత్ లో జిల్లా వ్యాప్తంగా బాధితులకు మంచి అవకాశం అని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ గారు తెలిపారు. *జిల్లా పోలీస్ కార్యాలయం- కొమురం భీమ్ ఆసిఫాబాద్*

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News