నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయానికి తిరుచానూరు కెనరా బ్యాంక్ ప్రతినిధులు గురువారం క్యాష్ కౌంటింగ్ మిషన్ ను విరాళంగా ఆలయంలో అందించారు. ఈ మేరకు క్యాష్ కౌంటింగ్ మిషన్ ను ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ కు కెనరా బ్యాంక్ ప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ మునిచెంగల్ రాయలు, ఇతర అధికారులు కెనరా బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు.





