టి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 18కాగజ్‌నగర్. పట్టణం లో ఈఎస్.ఐ సమీపంలోని ఎస్‌పీఎం క్వార్టర్స్ వద్ద. పెద్ద పెద్ద.కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నివాస ప్రాంతంలో కొండచిలువ తిరుగుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై సమాచారం అందించారు.అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులు ధైర్యంగా స్పందించి, ఎలాంటి ప్రమాదం జరగకుండా చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం ఇచ్చి, వారి సూచనల మేరకు ఆ కొండచిలువను పట్టణానికి దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలివేశారు.ఈ ఘటనతో స్థానికులు ఊపిరి పీల్చుకోగా, సకాలంలో స్పందించిన సెక్యూరిటీ గార్డులను ప్రశంసించారు. నివాస ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.





