Wednesday, March 18, 2026

నల్లబెల్లి మండలంలో ధాన్యం అపహరణ ఆరోపణలపై విచారణ

నేటి సాక్షి, నల్లబెల్లి డిసెంబర్ 18 :నల్లబెల్లి మండలంలోని గోవిందపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రెండు ఎకరాల వరి ధాన్యం అపహరణకు గురైందని భూక్య శారద పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు నల్లబెల్లి మహిళా సమాఖ్య ఏపీఎం సుధాకర్, ఎస్ఐ గోవర్ధన్ సంయుక్తంగా విచారణ చేపట్టారు.విచారణలో బాధితురాలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అధికారులు విచారణ అనంతరం రికార్డులు తేల్చి చెప్పారు.ధాన్యం లెక్కలు, కేంద్రంలోని రికార్డులు పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బాధితురాలితో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులు, గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.అనవసరమైన అపోహలకు తావు లేకుండా రైతులు సహకరించాలని అధికారులు సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News