Wednesday, March 18, 2026

*శ్రీవారి నగర్.. రామకృష్ణారావు నగర్ రోడ్ సిమెంట్ రోడ్డు కు భూమి పూజ*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*తిరుపతి రూరల్* కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సుపరిపాలనలో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పంచాయతీ అభివృద్ధికి పెద్దపీట వేశారు శుక్రవారం తిరుపతి రూరల్ ఓటేరు పంచాయతీ లోని శ్రీవారి నగర్ రోడ్డు నుంచి రామకృష్ణారావు నగర్ మూడో రోడ్డు వరకు స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు సిమెంట్ రోడ్డుకు భూమి పూజలు చేసారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఓటేరు గ్రామపంచాయతీ దిన దిన అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోందని ఈ సందర్భంగా శ్రీవారి నగర్ నుండి రామకృష్ణ రావు నగర్ మూడో వీధి వరకు సిమెంట్ రోడ్డు పనులకు భూమి పూజ చేయడం జరిగిందని ఇదివరకు కొన్ని రోడ్లు పారిశుధ్య పనులు కూడా చాలా జరిగాయని ఆ పనులకు కావలసిన నిధులను మంజూరు చేస్తూ ఎమ్మెల్యే అన్ని విధాలా ఓటేరు గ్రామాన్ని అభివృద్ధి పరిచే దిశలో ఎన్నో కార్యక్రమాలు చేయిస్తున్నారని ఓటేరులో జరిగిన రోడ్డు పనులకు భూమి పూజలో స్థానిక తెలుగు దేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మోహన్ , సుదర్శన్,లోకేష్ అలాగే కూటమి నాయకులు ఈశ్వర్ శ్రీహరి,తెలుగుదేశం నాయకులు రంగయ్య, రమేష్ బాబు,మణికంఠ,ఉమాపతి గ్రామపంచాయతీ సెక్రటరీ నరసింహం తెలుగుదేశం సీనియర్ నాయకులు సూర్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News