నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)రామచంద్రాపురం: మండలంలోని కుప్పం బాదూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఢిల్లీ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలలో బంగారు పథకం సాధించాడు. ఈ సందర్భంగా శుక్రవారం కుప్పం బాదూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజనికుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థి ఢిల్లీ, వ్యాయామ ఉపాధ్యాయులు గోపీనాథ్ లను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కుప్పం బాదూరు ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఢిల్లీ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఈనెల 16, 17 18 తేదీలలో జరిగిన స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి అండర్ -14 బాలబాలికల వాలీబాల్ పోటీలలో బాలుర విభాగం నందు చిత్తూరు జిల్లా జట్టు తరుపున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించినట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా జట్టు సభ్యులలో ఢిల్లీ విశేషంగా రాణించి జట్టు మొదటి స్థానం నిలిపి బంగారు పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. విద్యార్థి ఢిల్లీ మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయులు గోపీనాథ్ తనలోని ప్రతిభను గుర్తించి క్రీడల్లో రాణించేలా మెలకువలు నేర్పించి ప్రోత్సహించినట్లు పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.





