నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు),……………………………………పొలాసలోని108 శ్రీచక్ర సహిత లలితామాత ఆలయం,శ్రీ సూర్య ధన్వంతరి ఆలయాల్లో మహిళలు ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు. జగిత్యాల పట్టణ చింతకుంట లోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం లో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి అధ్వర్యంలో శుక్రవారం బహుళ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని, మాతలు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన, లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం గావించారు.పారాయణం అనంతరం మాతలు అమ్మ వారికి ఒడి బియ్యం సమర్పించారు.కుంకుమ పూజ అనంతరం లక్కీ డిప్ ద్వార ఒక్కరిని ఎంపిక చేసి వారికి అమ్మ వారి శేష వస్త్రం ఆలయ పూజారి ఆశీర్వచనములతో సత్కరించారు.జగిత్యాల రూరల్ మండలం పొలాసలోని శ్రీ చక్ర సహిత లలితామాత ఆలయంలో ఫౌండరి ట్రస్ట్ చైర్మన్ చెల్లం స్వరూప ఆధ్వర్యంలో సుహాసినిలు లలితా సహస్రణామ పారాయణం, మణి ధ్విప వర్ణన చేసి, శ్రీ చక్రాలకు కుంకుమ పూజలు చేశారు.చెల్లం స్వరూప అమ్మవారి ఆలయంలో ఉన్న మరకత శ్రీచక్రానికి కుంకుమ పూజ భక్తి శ్రద్దలతో చేశారు.అనంతరం అన్నప్రసాధ వితరణ చేశారు.ఈ కార్యక్రమములో పొలాస ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ చెల్లం స్వరూప సత్తయ్య, డాక్టర్ వడ్లగట్ట రాజన్న, వోడ్నాల శ్రీనివాస్,ఎన్నం కిషన్ రెడ్డి, మార రాజేశం, గంగాధర్,మహేందర్,పాంపట్టి సులోచన,ఉటూరి కళ్యాణి, హరిత, ఉటూరి అర్చన, రంగ స్వప్న,వనజ, గోపతి స్వప్న, లత, మానస,వోడనాలా లత, సుజాత,స్వాతి, స్రవంతి, రుచిత, నీరజ, సన్నిహిత, సుజాత, హర్షిని, త్రివేణి, వాణి, ఉషారాని, అర్చకులు శ్రీహరి, అజయ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.





