Wednesday, March 18, 2026

సర్పంచ్ దంపతులకు మస్జిద్ కమిటీ సన్మానం

నేటిసాక్షి, తిమ్మాపూర్, డిసెంబర్ 19:కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ గ్రామ సర్పంచుగా ఇటీవల ఎన్నికైన తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాసరావు దంపతులతో పాటు పాలకవర్గాన్ని మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తిమ్మాపూర్ మండలంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన సర్పంచుకు శుభాకాంక్షలు తెలిపారు. పాలకవర్గ సభ్యులకు శాలువా కప్పి, స్వీట్లు తినిపించారు. అనంతరం పాలకవర్గ సభ్యులు మస్జిద్ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోగూరి అంజలి నరసింహ రెడ్డి, మస్జిద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అలియోద్దీన్, గౌరవ అధ్యక్షుడు శౌకత్ అలి, ఉపాధ్యక్షుడు బాబు పటేల్, సెక్రెటరీ మహమ్మద్ నిస్సార్, సహాయ కార్యదర్శి నిహాల్, కోశాధికారి సయ్యద్ హుస్సేన్, సభ్యులు జుబెర్, సోహెల్, ఖాజా పాషా, అజామ్, అమినొద్దిన్, ఖాసిం, అజీమ్, యూసఫ్ జానీ, ఎండీ నిస్సార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News