నేటి సాక్షి 19 పాములపాడు:-పాములపాడు మండలంలోని, చెలిమిల్ల గ్రామంలో సర్వే నెంబర్ 41/బిలో ఉన్న 6.81 సెంట్ల మొక్కజొన్న, మినుము పంటపై దుండగులు గడ్డిమందు కొట్టి నాశనం చేశారని కౌలు రైతు జి.లక్ష్మీనారాయణ, తండ్రి ప్రసాద్ విలేకరులకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కౌలు రైతు జి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నేను చెలిమిళ్ళ గ్రామంలోని జి.మురళి, తండ్రి ఎల్ల స్వామి కి చెందిన 41/బీలో ఉన్న 6.81 సెంట్ల పొలాన్ని రెండు లక్షల రూపాయలకు కౌలుకు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఇందులో నాలుగు ఎకరాలు మొక్కజొన్న, 2.81 సెంట్ల లో మినుము పంట వేయడం జరిగిందన్నారు. ఈ పంటలకు 2 లక్షల, 70 వేల రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగిందన్నారు. అయితే ఈనెల 17వ తేదీ బుధవారం రోజున రాత్రి సమయంలో నాకు పంటలు బాగా పండుతున్నాయని ఓర్చలేక వల్లపు రెడ్డి.విజయ భాస్కర్, తండ్రి వెంకటస్వామి నా మొక్కజొన్న, మినుము పంటపై గడ్డి మందు కొట్టి నాశనం చేయడం జరిగింది. గతంలో కూడా ఈ విధంగానే గడ్డి మందు కొట్టి నాశనం చేసి భయభ్రాంతులకు నన్ను గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి అధికారులు విచారణ జరిపి నాకు పంట నష్టం కలిగించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకొని, నాకు నష్టపరిహారం ఇప్పించి, న్యాయం చేయాలని కోరారు.





