నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 19~అన్నమయ్య జిల్లా :- ముస్లింలకు పవిత్రమైన శుక్రవారం నాడు (జుమా) మధ్యాహ్న సమయంలో ఆయా మసీదులలో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు (జుమా నమాజ్) చేయడం పెద్దల కాలం నుండి ఆనవాయితీగా వస్తా ఉందని వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. మదనపల్లె నియోజకవర్గ పరిధిలోని నిమ్మనపల్లె మండల కేంద్రమైన చౌకిళ్లవారిపల్లి గ్రామంలో గల మదీనా మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు శుక్రవారం నిస్సార్ అహ్మద్ తోటి ముస్లిం మైనార్టీ సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. గ్రామ ముస్లిం మైనార్టీ సోదరులు, గ్రామ వైసీపీ శ్రేణులు ఆహ్వానం మేరకు చౌకిళ్లవారిపల్లి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోకి విచ్చేసిన నిస్సార్ అహ్మద్ ను పార్టీ ముస్లిం మైనార్టీ సోదరులు, స్దానిక ముస్లిం మత పెద్దలు, వైసీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామ పెద్దలను ఆత్మీయ పలకరింపుతో యోగక్షేమాలు అడిగి విచారిస్తూ గ్రామ మహిళలకు అభివాదం చేస్తూ మసీదు ప్రాంగణం వరకు కాలి బాటన నడిచొచ్చారు. మసీద్ ప్రాంగణం వద్దకు చేరుకోగానే మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులు గౌరవ మర్యాదలతో దుశ్శాలువాలు కప్పి, పూల బొకే అందించి మసీదు లోనికి ఆహ్వానించారు. అనంతరం తోటి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనానంతరం మత పెద్దలను ఆప్యాయంగా పలకరించి మసీదు సమస్యలపై ఆరా తీశారు. మసీదు అభివృద్ధికి సహకరిస్తానని మసీదును మరింత అభివృద్ధి చేసుకుందామని ఇందులో పార్టీలకతీతంగా ముందుకు రావాలని దేవుళ్ళ ప్రార్థనల వద్ద పూర్తిగా రాజకీయాలను పక్కనపెట్టి అందరం ఏకమై సహకరించుకుంటూ అభివృద్ధి చేసుకుందామని నిస్సార్ అహ్మద్ చెప్పడంతో తోటి ముస్లిం, మైనార్టీ సోదరులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో కలియ తిరుగుతూ స్దానికులతో మాట్లాడారు. గ్రామ సమస్యపై విచారించారు. గ్రామంలో ఏ సమస్య ఉన్న నేరుగా వచ్చి తనను కలవాలని తక్షణమే పరిష్కారం చేస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమానికి షేక్ సయ్యద్ సాబ్, గులాం అలీ, చాంద్ బాషా, సయ్యద్ బాషా, రఫీ, గౌస్, అన్వర్, ఇస్మాయిల్ ఖాన్, సద్దాం, షఫీ, మౌలా, దావూద్, ఎన్. నవాజ్, షానవాజ్, ఫక్రుద్దీన్, ఖిజర్ ఖాన్, నూర్ మొహిద్దీన్, సాదిక్, సమద్, ఎస్ అబ్దుల్ అబ్దుల్లా, జైన్, అబ్దుల్లా భాయి యాసీన్, సాదిక్, రియాజ్ మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~~~





