Wednesday, March 18, 2026

*గాంధీ పేరును దేశప్రజల నుంచి వేరు చేసే కుట్ర* *యూపీఏ హయాంలో ఉపాధి హామీ పథకం పక్కాగా అమలు**సోనియా, రాహుల్ గార్లను వేధిస్తున్న మోడీ సర్కార్: కేఎల్ఆర్**

(నేటిసాక్షి ప్రతినిధి మహేశ్వరం డిసెంబర్ 19:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మహేశ్వరం మండల కేంద్రంలోని తుక్కుగూడలో కేఎల్ఆర్ మాట్లాడుతూ…జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించటం చరిత్రను కాలరాయటమేనని మండిపడ్డారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచెన్నగారి లక్ష్మారెడ్డి.ప్రతిపక్షాలు, ప్రజల అభిప్రాయాలకు విలువ లేకుండా… చట్టసభ సభ్యుల హక్కులను కాలరాస్తూ… బిల్లుకు ఆమోదం తెలపటం బీజేపీ నిరంకుశ పాలనకు నిదర్శనమని కేఎల్ఆర్ అన్నారు.వీబీ జీ రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్) పథకాన్ని బలవంతంగా దేశ ప్రజలు, ఉపాధి హామీ కూలీలపై రుద్దటమేనని కిచ్చెన్న బీజేపీపై మండిపడ్డారు.జాతిపిత పేరును భారతీయుల మనసుల నుంచి వేరు చేసే కుట్రకు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందని లక్ష్మారెడ్డి విమర్శించారు.*గాంధీ కుటుంబంపై మోడీ కక్ష సాధింపు: కేఎల్ఆర్*దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబంపై బీజేపీ కేంద్ర సర్కార్, మోడీ కక్ష సాధింపునకు నేషనల్ హెరాల్డ్ కేసే నిదర్శనమని కిచ్చెన్న మండిపడ్డారు.సోనియాగాంధీజీ, రాహుల్ గాంధీజీలపై ఈడీ వేసిన ఛార్జిషీట్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిందని… న్యాయస్థానంలో సత్యమే గెలిచిందని లక్ష్మారెడ్డి అన్నారు.ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ… రాజ్యాంగ సంస్థలను పావులుగా కేంద్ర సర్కార్ వాడుకుంటుందని కేఎల్ఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News