(నేటిసాక్షి ప్రతినిధి మహేశ్వరం డిసెంబర్ 19)* , రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం:మహేశ్వరం మండలంలో మహేశ్వరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన *మునగపాటి నవీన్‌తో* పాటు ఉపసర్పంచ్, వార్డు సభ్యులందరినీ *_మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శసబితా ఇంద్రారెడ్డి* శాలువాలతో సత్కరించి హృదయపూర్వకంగా అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు.సర్పంచ్ మునగపాటి నవీన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నమస్కారాలు తెలుపుతూ ధన్యవాదాలు తెలిపారు. మహేశ్వరం గ్రామ అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనకడుగు వేయబోనని, ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కర్రోళ్ల చంద్రయ్య, ఆనందం, సుధీర్ గౌడ్, మినాస్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.





