Wednesday, March 18, 2026

*వేంపెంట గ్రామంలో వికలాంగులకు, వృద్ధులకు బట్టలు పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ, సింగపూర్ నాగేశ్వరావు సతీమణి టేకూరి రేణుక*

నేటి సాక్షి 19 డిసెంబర్ పాములపాడు:- పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో వికలాంగులకు, వృద్ధులకు సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు తరఫున మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ, ఆయన సతీమణి టేకూరి.రేణుక, కుమారులు టేకూరి.కుందన్, టేకూరి.యువ లు బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ, ఆయన సతీమణి టేకూరి.రేణుక లు మాట్లాడుతూ అందరితోపాటు వాళ్లు కూడా అన్ని పండుగలకు మంచి దుస్తులు వేసుకొని సంతోషంగా గడపాలని ప్రతి సంవత్సరం వికలాంగులకు, వృద్ధులకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వికలాంగులమని, వృద్ధులమని అధైర్యపడొద్దు మీకు అన్ని విధాలుగా మేము తోడుగా ఉంటామని పిలుపునిచ్చారు.ఈ సమాజ సేవా కార్యక్రమాలు గత 17 సంవత్సరాలుగా వేంపెంట గ్రామం మొదలుకొని సింగపూర్ దేశం వరకు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు.మా కుటుంబం రాజకీయాలకతీతంగా, కుల మతాలకు అతీతంగా, పేదరిక నిర్మూలన కోసం మతసామరస్యంతో మానవత్వంతో అనేక సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించి, చేయూతను అందిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో వేంపెంట గ్రామబూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, సుబ్బారావు, మద్దూరు ప్రసాద్, చిన్నస్వామి ఆచారి, శేషిరెడ్డి, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News