Wednesday, March 18, 2026

*బంగ్లాదేశ్ ప్రధాని మమ్మద్ యూనిస్ దిష్టిబొమ్మ దహనం**బాంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులను ఖండించిన భారతి రక్ష సమితి” రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు*———————————————-నేటి

సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)………………………………………భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్థానిక తైసిల్ లో బాంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ సి ఎస్ రాజు ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ యూనిస్ దిష్టిబొమ్మ దహనము నిరసన వ్యక్తం చేశారు *ఏసిఎస్ రాజు, చిట్ల గంగాధర్ న్యాయవాది,అక్కినపల్లి కాశీనాథ్ మాట్లాడుతూ* బాంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులకు పరాకాష్ట దీప్ చంద్ దాస్ అనే హిందూ యువకుడి దారుణ హత్య అని పైశాచికంగా హత్య చేయడమే కాక వేలాదిమంది చూస్తుండగా చెట్టుకు ఉరివేసి కాల్చి చంపడం దారుణమైన చర్య అని ఓటు బ్యాంకు రాజకీయాలతో దేశంలో ఉన్న సెక్యులరిస్టులు కుహనా మేధావులు ఈ దాడులను ఖండించకపోవడం శోచనీయమని ప్రపంచంలో ఎక్కడో జరిగే సంఘటనలను ఖండించే మానవ హక్కుల సంఘాలు కూడా స్పందించకపోవడం దారుణమని హిందూ సంఘాలు హిందువులైన ఈ దాడులను ఖండించాలని అన్నారు బాంగ్లాదేశ్ లో హిందువుల మీద హిందూ దేవాలయాల మీద దాడులు యువతులు మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్న అక్కడి ప్రభుత్వము స్పందించకపోవడం దారుణమని ఈ విషయంలో భారత ప్రభుత్వమైన తగు చర్యలు తీసుకుని పాకిస్తాన్ నుంచి ఎలా గైతే బంగ్లాదేశ్ ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేశారో హిందువులకు కూడా బాంగ్లాదేశ్ విభజించి ఒక ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బండారి మల్లికార్జున్ కొత్తకొండ బాలన్న ఎడమల వెంకటరెడ్డి నరేందుల శ్రీనివాస్ సిరిపురం గంగారాం మాజీ కౌన్సిలర్ గాజుల నగేష్ రాపర్తి రవి తునికి అంజన్న కొలుగూరి ప్రసాద్ రావు వేముల దేవరాజం బొందుకూరి శ్రీనివాస్ అనుమల భుజంగం మా దాని రత్నాకర్ బాశెట్టి ప్రభాకర్ గాజుల నాగరాజు కె.ఆర్ కృష్ణ గాధాసు భూమన్న పెండెం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News