Wednesday, March 18, 2026

*తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో డబ్బులు మీకు.. జబ్బులు ప్రజలకా**డ్రైనేజీ సమస్య తో కంపుకొడుతున్న తిరుపతి ఆర్టీసీ బస్టాండ్* *ఆర్టీసీ బస్టాండ్ లో మౌలిక వసతులు కల్పించాలి* *సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పి దుర్గా భవాని డిమాండ్*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో బస్సు దిగా లంటే ముక్కు మూసు కోవాల్సిందేనని ఇంటి పేరు కస్తూరి కానీ ఇంట్లో గబ్బిలాల కంపు అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పి దుర్గాభవాని సూటిగా ప్రశ్నించారు. శనివారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో పారిశుధ్య లోపంతో అస్తవ్యస్తంగా ఉన్న బస్టాండ్ పరిసరాలను బాగు చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జె విశ్వనాథ్ నాయకత్వంలో ఆర్టీసీ బస్టాండ్ లో ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమం కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పి దుర్గా భవాని మాట్లాడుతూ తిరుపతి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అని చెప్పుకుంటున్న స్మార్ట్ సిటీ అని ప్రకటనలు చేసుకుంటూ ఉన్న తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ తీరు పేరు చూస్తే గొప్ప ఊరు చూస్తే దిబ్బా అనే అనే చందంగా ఉందని తీవ్రంగా విమర్శించారు . తిరుపతికి భక్తులు ప్రయాణికులు రోజుకు 70 వేలకు పైగా వస్తూ పోతూ ఉంటారని ఇలాంటి చోట కనీస మౌలిక వసతులైన బాత్ రూమ్ లో బాత్రూంలో నీళ్లు ఉన్న బాత్రూములు శుభ్రత లేకపోవడం భక్తులకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం తీవ్రంగా తప్పుపట్టారు దీనివల్ల భక్తులకు ప్రయాణికులకు అనారోగ్యాలు వస్తే ఎవరు చూసుకుంటారని ప్రశ్నించారు బస్టాండ్లలో సరైన వసతులు కల్పించడానికి ఎందుకు బాధ్యత వహించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. బస్టాండ్ లో ఈ కంపు తీరు మారాలని ఆర్టీసీ యాజమాన్యానికి హితువు పలికారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఏ విమల సిపిఐ జిల్లా కార్యదర్శి ఈ మురళి మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యానికి భక్తులు ప్రయాణికుల ఆరోగ్యం పట్టదని డబ్బులు మీకు జబ్బులు ప్రజలకు కా అని ప్రశ్నించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో అవసరమైనన్ని సీసీ కెమెరాలు లేకపోవడంతో భక్తులు పట్ల ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మహిళలకు రక్షణ లేకుండా పోతుందన్నారు ఆదమరిస్తే బ్యాగులు సెల్ ఫోన్లు దొంగతనాలు విరివిగా జరుగుతున్న అరికట్టే నాధుడే కరువయ్యారని వాపోయారు రోజురోజుకీ ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులు పెరుగుతున్న కొద్దీ పారిశుద్ధ కార్మికులను పెంచాల్సింది పోయి తగ్గించడం ఏంటని వారు ప్రశ్నించారు గతంలో 110 మంది ఉన్న పారిశుధ్య కార్మికుల్ని 64 కుదించడంతో బస్టాండు కంపు కంపు గా మారిందని మండిపడ్డారు అదే విధంగా బస్టాండ్లో ప్రయాణికులు ఏది కొందాం అన్నా డబల్ రేట్లు పెట్టాల్సిన పరిస్థితి ఉన్న బాత్రూం కి వెళ్ళాలంటే బోర్డులో ఐదు రూపాయల అని ఉంటుంది కానీ పది రూపాయలు ఇస్తే తప్ప పాస్ పోసుకోవడానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో దాపరించిందని తక్షణమే ఆర్ టి సి ఆర్ ఎం చొరవ తీసుకొని అవసరమైనన్ని మరుగుదొడ్లతో పాటు మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్టీసీ ఆర్ ఎం జగదీష్ కు పార్టీ నాయకత్వం వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆర్టీసీ ఆర్ ఎం జగదీష్ స్పందిస్తూ మీరిచ్చిన చూపెట్టిన సమస్యలన్నింటినీ త్వరితగతిన దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య , కే రాధాకృష్ణ , జె విశ్వనాథ్ బండి చలపతి, వి ఉదయ్ కుమార్,బి నదియా, వి జయలక్ష్మి, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు వివిధ ప్రజా సంఘాల నాయకులు ఎన్ డి రవి, ఆర్ బలరాం, కె పద్మనాభ రెడ్డి, మహేంద్ర, ఎం రామకృష్ణ, సాయి కుమార్, చిన్నం కాళయ్య, ప్రవీణ్, హరికృష్ణ, సి రత్నమ్మ, విజయ, ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News