Wednesday, March 18, 2026

మేము పీకలేకపోయాం. మీరు వచ్చారుగా వచ్చి పీకండి..!మీరు వస్తే పీకించుకోవడానికి సిద్ధమే..!తనదైన శైలిలో అంబటి రాంబాబు కౌంటర్..!

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 20~అన్నమయ్య జిల్లా :- ఏపీలో రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ ముదురుతోంది. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీలను టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్టుల చర్చ జరుగుతూనే ఉంది. అదే సమయంలో కూటమి పార్టీలు వైసీపీని టార్గెట్ చేస్తూ పెడుతున్న పోస్టులపై ఆ పార్టీ నేతలు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. అయితే శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో అమరజీవి జలధార పథకం శంఖుస్థాపనకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు అంతే దీటుగా వైసీపీ నేత అంబటి రాంబాబు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైసీపీ సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంపై పెడుతున్న పోస్టులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో కానీ, విదేశాల్లో వాగే వాళ్లతో సహా, ఇక్కడ కూర్చుని భవిష్యత్తులో మేం వస్తాం. వచ్చి ఏం చేస్తామంటే వచ్చినప్పుడే (అధికారంలో ఉన్నప్పుడే) ఏమీ పీకలేకపోయారు. ఇప్పుడు ఏం మాట్లాడతారంటూ పవన్ కళ్యాణ్ తనదైన సైజులో రెచ్చిపోయారు. వచ్చినప్పుడే ఏమీ పీకలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడే ఏం పీకలేకపోయారు. ఇప్పుడు మీ బెదిరింపులకు భయపడుతామని అనుకుంటున్నారా. మేము 48గంటల్లో ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మీరలా మాట్లాడలేరని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు అదే దీటుగా సమాధానం ఇచ్చారు. వైసీపీ లక్ష్యంగా పవన్ చేసిన ఈ విమర్శలపై ఆ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. మేము పీకలేకపోయాం, మీరు వచ్చారుగా. వచ్చి పీకండి. మేము సిద్ధంగా ఉన్నాం పీకించుకోడానికి అంటూ అంబటి తనదైన శైలిలో పవన్ పై సెటైర్లు వేశారు. తన కామెంట్స్ కు పవన్ కళ్యాణ్ అకౌంట్ ను కూడా ట్యాగ్ చేశారు. అలాగే పవన్ వైసీపీ టార్గెట్ గా చెప్పిన డైలాగ్స్ వీడియో కూడా జత చేశారు. దీంతో ఈ రెండూ వైరల్ అవుతున్నాయి..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News