Wednesday, March 18, 2026

నేటి యువతకు ఎంతో ఆదర్శం ఈ విద్యావంతురాలు..కష్టాల కడలి నుండి పోలీస్ కానిస్టేబుల్ వరకు ఆమె సక్సెస్ స్టోరీ..

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 20~అన్నమయ్య జిల్లా :- పేదరికాన్ని ఎదిరించి, కట్టుబాట్లను తెంచుకుని ఓ ముస్లిం యువతి పోలీస్ ఉద్యోగాన్ని సాధించింది. ఐదు రూపాయల భోజనం నుండి అనుకున్నది పట్టు వీడకుండా విజయం సాధించింది. ఈ అమ్మాయే ఎందరికో ఆదర్శం. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందో తెలుగమ్మాయి. పేదరికాన్ని ఎదిరించింది కట్టుబాట్లను తెంచుకొని అవమానాలను దిగమింగుకొని ఇలా ఎన్నో అడ్డంకులు దాటుకుని ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. ఈ అమ్మాయి ఏం చేస్తుందిలే అన్నవారితోనే ఏం సక్సెస్ రా అనిపించుకుంది. ఇలా ఈ సక్సెస్ స్టోరీ నేటి యువతరానికి పాఠంగా పనికొస్తుంది. సక్సెస్ సాధించిన ఈమె నలుగురికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇక వివరాల్లోకెళ్తే వైఎస్ఆర్ కడప జిల్లాలోని ముద్దనూరు గ్రామానికి చెందిన షేక్ గన్లూర్ హఫిజున్ ది నిరుపేద కుటుంబం. తల్లితండ్రులు కూలికి వెళ్తేనే జీవనం గడుస్తుంది. కూడుకు లేక ఎన్నో రోజులు పస్తులున్నారు. ఓవైపు తల్లిదండ్రులు పడుతున్న బాధ. మరోవైపు బాగా చదవాలన్న కోరిక. ఇవన్నీ చూస్తూ చిన్నప్పటి నుండి కష్టాలను భరిస్తూనే కాదుకాదు. అనుభవిస్తూనే పెరిగింది. ఈమె మంచి విద్యావంతురాలు కావడంతో తల్లితండ్రులు ప్రోత్సహించారు. తమ కుటుంబాన్ని మార్చేది చదువు ఒక్కటేనని భావించిన తల్లిదండ్రులు ఆర్థిక కష్టాలు, కట్టుబాట్లను ఎదిరించి కూతురిని చదివించారు. తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా హఫిజున్ కూడా బాగా చదువుకుంది. తల్లిదండ్రులు కూలీనాలి చేయడం చూస్తూ పెరిగిన హఫిజున్ ఏనాడూ చదువుని నిర్లక్ష్యం చేయలేదు. తల్లిదండ్రులు గర్వపడేలా డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ ప్రారంభించింది. కానీ ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో పరిస్థితులు కఠినంగా మారాయి. తల్లితండ్రులు కోరిక మేరకు హఫిజున్ కు వివాహం చేశారు. పెళ్లి తర్వాత ఇక తన ఆశలు అడియాసలేనని భావించింది. కానీ తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేదు. ఓ యువకుడిని వివాహం చేసుకుంది. కానీ ఆమె నిర్ణయాన్ని గౌరవించే భర్త దొరికాడు. దీంతో హఫిజున్ తన ఉద్యోగ ప్రయత్నాన్ని కొనసాగించింది. చివరకు అనుకున్నది సాధించింది. తాజాగా పోలీస్ కానిస్టేబుల్ జాబ్ సాధించి పుట్టింటివారు, అత్తింటివారు గర్వపడేలా అన్న వాళ్ల నోర్లు మూపించింది. హఫిజున్ పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న సమయంలో అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. కరోనా మహమ్మారి వీళ్ళ కుటుంబం పై కక్ష సాధించింది. ఆ సమయంలో కన్న తల్లి మరణించింది. కట్టుకున్న భర్త తోడుగా ఉంటాడనుకున్న సమయంలో అనారోగ్యం బారిన పడ్డాడు. ఓవైపు పుట్టింటి బాధలు. మరోవైపు అత్తింటి బాధ్యత ఆమెపై పడింది. ఉద్యోగం వచ్చేవరకు ల్యాబ్ టెక్నిషన్ గా ఉద్యోగం చేస్తూ పుట్టింటిని, అత్తవారింటిని పోషించింది. ఈమెకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకును చదివిస్తోంది. ఇలా ఓ వైపు కుంటుంబం, మరో వైపు తన ఆశయం రెండింటిని బ్యాలన్స్ చేస్తూ నెట్టుకొచ్చింది. పేదరికం, ఆర్థిక కష్టాలు వెనక్కి లాగుతున్నా హఫిజున్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మరింత రెట్టించిన ఉత్సాహంతో జీవితంలో సవాళ్లను ఎందుర్కొంది. ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తూ ఎంతో కష్టపడి పోలీస్ ప్రిపరేషన్ కొనసాగించింది. ఆమె కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ ను ఎంతో కష్టపడి పూర్తి చేసింది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో షేక్ గన్లూర్ హఫిజున్ ఎట్టకేలకు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించింది..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News