Wednesday, March 18, 2026

*పరిశుభ్రత ఆరోగ్యానికి తొలిమెట్టు*

నేటి సాక్షి,బాపట్ల జిల్లా (కర్లపాలెం)పరిశుభ్రత ఆరోగ్యానికి తొలిమెటి అని కర్లపాలెం మండల ప్రత్యేక అధికారి శ్రీలక్ష్మి అన్నారు. బాపట్ల నియోజకవర్గ పరిధిలోని కర్ల పాలెం లో స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ్ ఆంధ్ర సాధనకు అందరూ కృషి చేయాలని కర్లపాలెం ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు అన్నారు.ఈ సందర్భంగా విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించి, ప్రతిజ్ఞ చేయించారు. మొక్కలు నాటండి, ప్లాస్టిక్ నిషేధించండి అని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోస్ శ్రీనివాసరావు, పద్మావతి ఉపాధ్యాయులు ఇన కొల్లు పోలీసు రావు, సంతోష్, ఉదయ్ కుమార్, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పిట్ల వసంతరెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కరిముల్లా ఖాన్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News