నేటి సాక్షి పాలేరు ,డిసెంబర్ 20 :ఆడపిల్ల పెళ్లి పేదింటికి భారం కాకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరం అన్నారు క్యాంపు కార్యాలయం ఇంచార్జి బీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.. శనివారం కూసుమంచి మండలం తురకగూడెం గ్రామానికి చెందిన కల్యాణలక్ష్మి చెక్కులను సర్పంచ్ బుర్ర కృష్ణతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.. ఈ సందర్భంగా సర్పంచ్ బుర్ర కృష్ణ మాట్లాడుతూ.. ఆడపిల్ల పెళ్ళికి పెద్దన్నల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.. తొలిసారిగా సర్పంచ్ గా ఎన్నికైన తరువాత ఇలాంటి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొనటం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తుర్కగూడెం సర్పంచి బుర్ర కృష్ణ , ఉప సర్పంచ్ కొమ్ము ఎల్లమ్మ , వార్డు మెంబర్లు కొమ్ము సుధాకర్ ,కన్నెబోయిన భద్రకాళి, కన్నెబోయిన సురేష్ , కొమ్ము గోపి ,నాయకులు బుర్ర వెంకన్న,బుర్ర వీరబాబు ,బుర్ర మమత ,బుర్ర రజిత ,కన్నెబోయిన తిరపయ్య , బొల్లం లింగరాజు, వల్లెపు గోపాలరావు, గణపారపు వినయ్ , కన్నెబోయిన లింగరాజు తదితరులు పాల్గొన్నారు..





