Wednesday, March 18, 2026

*కోరుట్ల బస్టాండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం** గుర్తుతెలియని వ్యక్తి మృతి*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలోని బస్టాండ్ ఇన్ గేట్ వద్ద ఈ డిసెంబర్ 20 మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతదేహాన్ని తక్షణమే కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో స్థానికులు సహాయానికి పరుగెత్తారు, అయితే ప్రాణాలు కాపాడలేకపోయారు.*మృతుడి గుర్తింపు కోసం పోలీసుల పిలుపు*మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఆయనను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రచురితమైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని ఎవరైనా గుర్తించినట్లయితే వెంటనే స్థానిక కోరుట్ల పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. సంప్రదించాల్సిన నంబర్లు: – SI కోరుట్ల: 8712656790 – CI కోరుట్ల: 8712656820 ___

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News