నేటిసాక్షి, మిర్యాలగూడ :ఘంటసాల 103వ, జయంతి సందర్బంగా సూర్యాపేట లో శ్రీ జ్ఞాన సరస్వతి సాంస్కృతిక కళావేదిక బుర్రి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా బాలభవన్ లో శనివారం పాటల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ పట్టణానికి చెందిన కాట్రావత్ సరస్వతి, తిక్క శంకరయ్య చిత్రంలోని కోవెల ఎరుగని దేవుడు కలడని పాటను ఆలపించినందుకు ద్వితీయ బహుమతి గెలుచుకున్నట్లు గాయని సరస్వతి తెలిపారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ కళావేదిక సభ్యులు ఏలె సత్యనారాయణ, జె శ్రీనివాస్ చారి, కందుకూరి సుదర్శన్, ఎం సత్యనారాయణ చారి,కే మురళీధర్ గుంటోజు సత్యనారాయణ చారి నవ్య కళానికేతన్ రామ రంగారావు, ప్రతాప్ కళాబృందం సరస్వతిని ప్రత్యేకంగా అభినందించారు.





