నేటి సాక్షి 20 డిసెంబర్ పాములపాడు :–ముస్తాబు కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యంప్రజాశక్తి పాములపాడు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని చేపట్టిన ముస్తాబు కార్యక్రమాన్ని మండల కేంద్రమైన ఆదర్శ పాఠశాల కళాశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల స్పెషల్ అధికారి రాజు తహసీల్దార్ సుభద్రమ్మ ఎంపీడీవో చంద్రశేఖర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటి పరిశుభ్రత, పాఠశాల పరిశుభ్రత, మొక్కలు నాటడం ప్రాముఖ్యత, ప్లాస్టిక్ వినియోగం నివారణ వంటి అంశాలపై విలువైన సూచనలు చేశారు.విద్యార్థులు శుభ్రంగా ఉండి, మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే మీ గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచుకున్నట్టే” అని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ నాగ రవీంద్ర ఫిజికల్ డైరెక్టర్ సాయి కృష్ణ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు





