నేటి సాక్షి కొమరసిఫాబాద్ ఈరోజు ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి లో గొల్లగుడా గ్రామం ఈదులవాడ gp, ఆసిఫాబాద్ మండలం లో ఉప్పరి లచ్చయ్య (58 సం,లు) అనే వ్యక్తి గత 2 నెలల నుండి మద్యానికి బానిసై మరియు పత్తి పంటకు నష్టం వాటిల్లడం, ఆశించిన దిగుబడి రాకపోవడం తో నిన్న తేదీ 19.12.2025 సాయంత్రం తన పొలంలో ఉన్న చెట్టుకు నైలాన్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆసిఫాబాద్ పి. బాలాజీ వర ప్రసాద్ గారు తెలిపారు. ఈ సంఘటన పై ఈరోజు అనగా తేదీ 20.12.2025 ఉదయం 08:00 గంటలకు మృతిని బార్య ఉప్పరి లక్ష్మి (43 సం.) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగినది అని తెలిపారు. – SHO, ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్





