నేటి సాక్షి,నారాయణపేట డిసెంబర్ 20, నారాయణపేట జిల్లా: నారాయణపేట జిల్లాలోని వివిధ మండలాల్లోని గ్రామాల్లోని ప్రజలు అత్యవసరంగా అప్పుడే పుట్టిన నవజాత శిశువు, మరియు చిన్న పిల్లలకు అత్యవసరంగా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే 108కి ఫోన్ చేసి,, మాత శిశువు అంబులెన్స్ సేవలు వినియోగించుకోవాలని జిల్లా సూపర్వైజర్ రాఘవేందర్ ఒక ప్రకటనలో తెలియజేశారు, అత్యవసర సమయంలో మత శిశు మరియు అంబులెన్స్ లో వెంటిలేటర్ సదుపాయం మరియు ఆక్సిజన్ సౌకర్యం మరియు మందులు మరియు శిక్షణ పొందిన టెక్నీషియన్ కూడా అందుబాటులో ఉంటూ మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికిలేదా హైదరాబాద్ నీలోఫర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఉచితంగా తరలిస్తారు.





