నేటి సాక్షి,నారాయణ పేట డిసెంబర్ 20,మీడియా కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్టులపై కుట్రపూరితంగా గతంలో ఆర్టీసీ శాఖకు సంబంధించిన సమాచారం కోరినందుకు జర్నలిస్టులు అడిగిన సమాచారం ఇస్తే ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని… తమ ఉద్యోగ భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుందని ముందస్తు ఆలోచనతో కుట్రపూరితంగా జర్నలిస్టులపై తప్పుడు ఫిర్యాదు చేసి కేసులు పెట్టించిన ఆర్టీసీ అధికారులపై తక్షణమే కేసులు నమోదు చేయాలని నారాయణపేట జిల్లాకు చెందిన జర్నలిస్టు సంఘాల నాయకులు శనివారం సాయంత్రం నారాయణపేట పోలీస్ స్టేషన్లో సీఐ శివశంకర్, ఎస్సై వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. సీఎం, డిజిపిని కలిసి నారాయణపేట ఆర్టీసీ శాఖలో జరిగిన అక్రమాలను సాక్షాదారులతో సహా నిరూపిస్తామన్నారు. యుక్త వయసులో ఉన్న విద్యార్థులు విద్యార్థినిలు చీకటి సమయం వరకు బస్సు కోసం ఎదురు చూడగా నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థులను విద్యార్థి సంఘాల నాయకులను రెచ్చగొట్టిన ఆర్టీసీ అధికారులపై తక్షణమే కేసు నమోదు చేయాలన్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్, డిజిపి దృష్టికి తీసుకువెళ్లి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.





