నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 20~అన్నమయ్య జిల్లా :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా హడావిడి మొదలైంది. డిసెంబర్ 21వ తేదీన వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు ను పురస్కరించుకొని బెంగళూరు, ఏపీ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు, కటౌట్లు సందడి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా చేసేందుకు అటు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పార్టీ నుంచి కూడా కీలక ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రక్త దానాలు కూడా జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తాడేపల్లి లో ఉన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముందు వెలిసిన ఓ కటౌట్ అందరినీ ఆకట్టుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జగన్, కేటీఆర్ అలాగే కేసిఆర్ ఫోటోలు ఉన్న ఫ్లెక్సీ ని తయారు చేసి తాడేపల్లి నివాసం వద్ద ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన వైసీపీ అలాగే గులాబీ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ఇటు తెలంగాణలో చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి కాబోతున్నట్లు ఇప్పటినుంచే ఈ పోస్టులు వైరల్ చేసి కామెంట్లు చేస్తున్నారు. గురువు అలాగే శిష్యుడిని ఈ ఇద్దరు బడా నాయకులు ఓడించడం గ్యారంటీ అంటున్నారు. ఇక ఈ ఫ్లెక్సీలు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో గులాబీ పార్టీతో వైసిపి పొత్తు పెట్టుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఖమ్మం, నల్గొండ లాంటి జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డికి అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డి కి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి ప్రాంతంలో గులాబీ పార్టీ గెలవడం చాలా కష్టతరం అవుతోంది. అందుకే జగన్మోహన్ రెడ్డితో కలిసి కెసిఆర్ వెళ్లరున్నారట. పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని స్కెచ్ వేశారట. మన సర్పంచ్ ఎన్నికల సమయంలో కూడా ఖమ్మంలో వైసిపి సపోర్ట్ తో గులాబీ పార్టీ చాలా మంది సర్పంచులను గెలిపించుకుంది. అదే స్ట్రాటజీని 2028 ఎన్నికల సమయంలో అమలు చేయాలని జగన్ తో పాటు కేసీఆర్ స్కెచ్ లు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే దానికి సంకేతంగా ఈ కటౌట్ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు..~~~~~~~~~~~~~~~~~~





