Tuesday, March 17, 2026

తేదీ:21-12-2025**ఉపాధి హామీ పథకం కు గాంధీ పేరు మార్పుపై ఏఐసీసీ,టీపీసీసీ ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నిరసన**డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క స్పీచ్ స్క్రోలింగ్స్*

నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్* మోదీ, అమిత్ షా కి గాంధీ పేరు పలికితే ఉలుకు* గాంధీ కుటుంబం పేరు పలికితే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి* గాడ్సేను పూజించే వారు కాబట్టే గాంధీ పేరు తొలగింపు* గాంధీ కుటుంబాన్ని ధైర్యంగా ఎదురుకునే ధైర్యం మోదీ, అమిత్ షా కి లేదు* గాంధీ పేరు పలికితే ప్రజల హృదయాల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కనపడతారు* దేశ ప్రజల గుండెల్లో గాంధీ పేరు చిరస్మరణీయం* అప్పటి మా కాంగ్రెస్ పార్టీ ప్రధాని మన్మోహన్ సింగ్ జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చారు.* ప్రజలకి 100 రోజుల ఉపాధి పథకాన్ని బిజెపి నిర్వీర్యం చేయటానికి ప్రయత్నిస్తుంది.* 2014 లో అధికారంలోకి వచ్చిన బీజేపీ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధుల కోత పెడుతూ వస్తోంది. తాజాగా 40% రాష్ట్రాలు భరించాలని మోడీ అంటున్నారు.* జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగింపు అప్రజాస్వామికం* మహాత్మా గాంధీ పేరు ప్రజల హృదయాల్లో నుంచి చెరపలేరు.* రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు బీజేపీ తెరలేపింది* మనుస్మృతి అమలు చేయాలని బీజేపీ పన్నాగం* జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తూ గాంధీ పేరు తొలగించడం విచారకరం* సోనియా గాంధీ కుటుంబం పై కక్ష్య పూరితంగా కేసులు* గాంధీ, నెహ్రూ దేశానికి చేసిన త్యాగాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరిపించే ప్రయత్నం చేస్తుంది* లౌకిక వాద దేశంలో మోదీ, అమిత్ షా పప్పులు ఉడకవు* కులాలు మతం పేరిట రాజకీయం చేసే వారికి గుణపాఠం తప్పదు.* వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం,రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం* పంచాయతీ ఎన్నికలో బీజేపీకి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు.*డీసీసీ కార్యాలయం, కుమురంభీమ్ ఆసిఫాబాద్*

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News