నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు:ది అపోలో యూనివర్సిటీ, చిత్తూరులో క్విజ్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. పోతరాజు మాట్లాడుతూ, గణితం శాస్త్ర, సాంకేతిక రంగాలకు పునాదిగా నిలుస్తుందని అన్నారు. కష్టాల మధ్యన కూడా గణితంపై అచంచలమైన నమ్మకంతో రాణించిన రామానుజన్ జీవితం విద్యార్థులకు ఆదర్శమన్నారు.గణితశాస్త్ర అధ్యాపకులు డా. బి. నాగేశ్వరరావు రామానుజన్ చేసిన పరిశోధనలు, సంఖ్యలపై ఆయన కృషిని వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గణిత క్విజ్ పోటీలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. *పండిత్ మదన్‌మోహన్ మాలవీయ జయంతి* ది అపోలో యూనివర్సిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్లబ్ ఆధ్వర్యంలో పండిత్ మదన్‌మోహన్ మాలవీయ జయంతిని శనివారం నిర్వహించారు. మాలవీయ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. బి. నాగేశ్వరరావు మాట్లాడుతూ, బనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపన ద్వారా మాలవీయ విద్యకు గొప్ప దిశ చూపారని అన్నారు.డా. ఏ. దివ్య మాలవీయ జీవితం, విలువలతో కూడిన విద్య ప్రాధాన్యతపై మాట్లాడారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

