నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : ( కోక్కుల వంశీ )రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గంను శనివారం రోజున ఎకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎలిగేటి సూర్యకిరణ్ క్లబ్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఉపాధ్యక్షుడిగా ఎలిగేటి ప్రదీప్ ప్రధాన కార్యదర్శిగా ఆకుల గంగాధర్, కోశాధికారిగా పోగుల మోహన్, సలహాదారుడిగా తుమ్మనపల్లి శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రెస్ క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు ఎలిగేటి సూర్య కిరణ్ మాట్లాడుతూ… పాత్రికేయుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. నూతన మండలంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణంతో పాటు పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డులు, ఇండ్ల స్థలల కోసం కృషి చేస్తామన్నారు. అనంతరం మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్సభ్యులు నంద్యాడపు అంజయ్య, బింగిశెట్టి వెంకటేష్, కుర్మచలం సత్యనారాయణ, సుడిగేపు పరుశురాం లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

