నేటిసాక్షి : జగదేవపూర్ డిసెంబర్ 27 జగదేవపూర్ మండలం తిగుల్ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కుడుదుల రజితను, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డిని శనివారం రైతుబంధు మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవి రవీందర్ శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద గ్రామపంచాయతీ అయిన తీగుల్లో భారీ మెజార్టీతో రజిత గెలవడం అభినందనీయమన్నారు. గ్రామ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తూ మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆదర్శ గ్రామం వైపు అడుగులు వేయాలని ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రజా నాయకురాలుగా పనిచేయాలని సూచించారు. రాజకీయంగా మరింత ఎదగాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎల్లయ్య పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ భూమయ్య గ్రామ నాయకులు మల్లారెడ్డి మహేందర్ రెడ్డి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

