నేటిసాక్షి, కరీంనగర్:రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి కరీంనగర్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండాను ఎగరవేయడం ఖాయమని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యం స్పష్టం చేశారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లను 6 జోన్లుగా విభజించామని, ప్రతీ జోన్‌కు ముగ్గురు సభ్యులను నియమించనున్నామని పేర్కొన్నారు. ఒకరు సెక్రటరీ, ఇద్దరు సెక్రటరీలుగా వ్యవహరిస్తారని, కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపునిచ్చి, పదవుల్లో అవకాశం కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో పీసీసీ ప్రతినిధులు నమిండ్ల శ్రీనివాస్, రుద్ర సంతోష్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆరెపల్లి మోహన్, వైద్యుల అంజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు..

