నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):* భూ సమస్య పరిష్కారం కావడం లేదని ఓ యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు . వివరాల్లోకి వెళితే గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన మంగరాపు రాజు అదే గ్రామానికి చెందిన మంగరాపు రవి మధ్య కొంతకాలంగా భూ సమస్య ఉంది. అయితే ఎన్నో ఏళ్లు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురైన రాజు శనివారం గ్రామ శివారులో గడ్డి మందు తాగి తన తల్లికి ఫోన్ ద్వారా విషయం చెప్పాడు. వెంటనే తల్లి ఇతరులతో రాజు దగ్గరికి వెళ్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స కోసం రాజు సహకరించలేదు. తనకు చికిత్స వద్దని ఎన్నో ఏండ్లుగా భూ సమస్యతో తన తల్లి తాను సతమతమవుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వాపోయాడు. తనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాలని బాధితుడు రాజు డిమాండ్ చేశాడు.

