నేటి సాక్షి,నల్లబెల్లి ,డిసెంబర్ 27 : నందిగామ గ్రామానికి చెందిన బొగ్గుల చిన్న కార్తి ఇంటి వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా బైక్‌తో పాటు ఇంట్లోని వస్తువులు దగ్ధమై సుమారు రూ.80,000 నష్టం వాటిల్లింది.విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ భూక్యా భాస్కర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగిలి మోహన్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.అపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చి, సహాయానికి ముందుకు రావాలని గ్రామస్తులను కోరారు.

