Wednesday, January 21, 2026

– అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడదీయొద్దు..- వెనుకబడిన ప్రాంతంలో భాగంగా ఏర్పడిన రాయచోటి జిల్లా కేంద్రాన్ని విభజించొద్దు..రద్దు చేయొద్దు.. – 2022ఏప్రిల్ 4న ఏర్పడిన అన్నమయ్య జిల్లానుయథాతథంగాకొనసాగించాల్సిందే..! – ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే తగిన గుణపాఠం తప్పదు.. వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి – శ్రీకాంత్ రెడ్డి

నేటి సాక్షి, అన్నమయ్య, శర్మ ~అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడదీయొద్దు. రద్దు చేయొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టమైన హెచ్చరిక చేశారు. అన్నమయ్య జిల్లా అనేది ప్రజల ఆకాంక్షతో కూడింది. అన్నమయ్య జిల్లా కోసం ప్రాణ త్యాగాలు చేశారు. అన్నమయ్య జిల్లా వాసుల కలను, భావోద్వేగాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేవారెవరైనా చరిత్ర హీనులవుతారన్నారు. వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా 2022 ఏప్రిల్ 4న ఏర్పడిన అన్నమయ్య జిల్లాను మొదట విభజించి, ఇప్పుడు పూర్తిగా రద్దు చేయాలనే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమైన ఆలోచనగా ఆయన అభివర్ణించారు. 17 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి గా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి ఏ చిన్నపాటి మేలు చేయలేదని, అలాంటి వ్యక్తి ఇప్పుడు సాధించుకున్న జిల్లాకే మంగళం పాడాలని చూస్తుండటం అన్యాయమన్నారు. 2022 ఏప్రిల్ 4 న ఏర్పడిన అన్నమయ్య జిల్లాను యధాతధంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. రాయచోటి ప్రాంతానికి అభివృద్ధి జరిగిందంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ, గత ప్రభుత్వ ప్రజా జననేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రమేనని గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ అన్నమయ్య జిల్లా కేంద్రం ఏర్పడిన అనతి కాలంలోనే రాయచోటి పట్టణం గణనీయం గా అభివృద్ధి చెందిందని, మూడవ గ్రేడ్ మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయడం వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ ఘనతేనని గుర్తు చేశారు. రాయచోటి జిల్లా కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సౌకర్యవంత మైన భవనాలును అనతి కాలంలోనే సమకూర్చడంతో అటు ప్రజలకు, ఇటు పనిచేసే అధికారులకు, సిబ్బందికి ఆ భవనాలు సౌకర్యవంతంగా ఉన్నాయన్నారు. జిల్లా కేంద్రమైన రాయచోటిలో మంచి జరుగుతున్న దశలో రాజకీయ కక్షలు, దురుద్దేశాలతో జిల్లా కేంద్రాన్ని లేకుండా చేయాలను కోవడం, జరిగిన మంచిని విచ్చిన్నం చేస్తుండడం ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోం దన్నారు. ఈ నిర్ణయాలతో తాము నిద్ర లేని రాత్రులు గడుపుతున్నామని, ప్రజల సహనాన్ని పరీక్షించొద్దని ఆయన హెచ్చరించారు. 2022 ఏప్రిల్ 4 న ఏర్పడిన అన్నమయ్య జిల్లా ను యధాతధంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక ప్రక్క గూడూరు వాళ్ళు రాజకీయ పరంగా ఒత్తిడి చేసి, వాళ్ళ కోరికను నెరవేర్చు కున్నారన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో వాళ్ళ సౌలభ్యంగా, అనుకూలంగా చేసుకోగలి గారన్నారు. రాయచోటి ప్రజల మనోభావాలను, ఆకాంక్షలును పూర్తిగా విస్మరించడం ఘోర అన్యాయమన్నారు. రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లె, సుండుపల్లె మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో చేర్చి, ఆ ప్రాంతాలను కడప జిల్లాలో చేర్చారన్నారు. వాటికి ఆనుకుని ఉన్న రాయచోటి నియోజకవర్గాన్ని మదనపల్లెకు కలపడం చూస్తే పాలకులకు కనీస విచక్షణ కూడా లేదనిపిస్తోందని, రాజకీయ కక్షతో చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ కొంత మంది డ్రామాలు ఆడుచున్నారన్నారు. జిల్లా విచ్ఛిన్నానికి వ్యతిరేకంగా మాట్లాడిన బీసీ నాయకులపై దాడులు జరగడం ప్రజాస్వామ్యంపై దాడేనని, వీటన్నింటినీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. మంచితనంతో , కష్టంతో, ఓపికతో రాయచోటి ప్రాంతంలో తాము ఎన్నో మంచి పనులు, అభివృద్ధి పనులు సాధించామని, కానీ ఈ రోజు వాటిని విధ్వంసం చేస్తున్నారని ఆయన ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ డ్రామాలతో నిజాన్ని దాచలేరని, అవసరమైతే పోరాటాలను మరింత ఉధృతం చేసి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆ రోజు రాష్ట్రాన్ని మూడు రాజధానులు చేస్తామంటే ఎన్నో మాట్లాడిన మీరు ఈ రోజు ప్రజల కళ్లముందే అన్నమయ్య జిల్లాను విచ్ఛిన్నం చేస్తుండడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటీషర్ల పాలన నుంచి కూడా 1800 సంవత్సరంలో ఏర్పడిన జిల్లాలు ఎక్కడా రద్దు కాలేదని , అన్నమయ్య జిల్లా విచ్చిన్నం పై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర మనోవేదనకు, వర్ణించలేని బాధకు గురి చేస్తోందన్నారు. జిల్లాల పునర్విభజనపై ఆదివారమే నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో, మరోసారి గట్టిగా ప్రశ్నిస్తున్నామని చెప్పారు. 2022 ఏప్రిల్ 4న ఏర్పడిన అన్నమయ్య జిల్లాను యథాతథంగా కొనసాగించాల్సిందేనని గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News