నేటి సాక్షి, అన్నమయ్య, శర్మ ~ చిత్తూరు జిల్లా :-: పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని సదుం మండల కేంద్రమైన యర్రాతివారిపల్లి లో వెలసిన కోటి మాలై శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో వందలాది మంది స్వాముల ఐక్యతలో వేద పండితుల మంత్రోచ్ఛారణ ఆలయంలో శాస్త్రాప్తంగా పడిమెట్ల పూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దిరెడ్డి కుటుంబమంతా విచ్చేసి సందడి చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిలు అక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాల నిర్వహణను దగ్గరుండి పర్యవేక్షించారు. వేద పండితులు స్వామివారి విగ్రహానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి వంటి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఉదయం నుంచినే స్వామివారికి సుప్రభాతసేవ, పంచామృత అభిషేకం, అలంకరణ, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి సతీ సమేతంగా వివిధ పుష్పాలు, స్వామి వారికి పండ్లు తల మీద పాగా చుట్టి శిరస్సుపై పెట్టుకుని స్వామివారికి అందించారు. 18 మెట్లకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పూజ: 18 మెట్లను పండ్లు, పూలతో అలంకరించి, దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. ఈ పద్దెనిమిది మెట్లకు పూజ చేయడం ఇది ముఖ్యమైన ఘట్టం. అయ్యప్ప నామస్మరణ, శరణుఘోషలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున భక్తి గీతాలు ఆలపించి కోలాటాలు, అయ్యప్ప స్వామి వారి నృత్యాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కనువిందు చేశారు. అయ్యప్ప మాల ధరించిన స్వాములు ఊరేగింపుగా స్వామివారిని తీసుకెళ్లారు. అన్నదానం దూర ప్రాంతాల నుండి వచ్చిన అయ్యప్ప స్వాములకు పెద్దిరెడ్డి కుటుంబం అన్నప్రసాద కార్యక్రమాలను అందించింది..~~~~~~~~~~~~~~~~~~

