నేటి సాక్షి డిసెంబర్ 28 తొగుట ప్రతినిధి.. వడ్డే. నర్సింలు తొగుట మండలం వెంకట్రావుపేట్ గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యం లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వోలపు సత్యనారాయణ పార్టీ జెండాను ఎగురవేశారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ,బ్రిటిషర్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టింది. తిండి గింజలు కూడా లేని పరిస్థితి లో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి వల్ల గుణాత్మకమైన మార్పులు వచ్చాయి.ఐఐటీ,ఎయిమ్స్ వంటి విద్యాసంస్థల స్థాపన,జలాశయాల నిర్మాణం,హరిత విప్లవం, భూ పరిమితి చట్టం,ఐటీ విప్లవం,ఆర్థిక సంస్కరణలు,ఉపాధిహామీ పథకం మొదలైన కార్యక్రమాలతో భారతదేశ దశ దిశలను మార్చి ప్రజలకు సంక్షేమాన్ని అందించి ,దేశాన్ని అభివృద్ధి చేశారు.ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసింది.మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని గత బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చింది.రాష్ట్రంలో గడిల పరిపాలన తెచ్చింది. ప్రజల ఆశీర్వాదం తో పది సంవత్సరాల తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంతో మళ్ళీ తెలంగాణలో ప్రజా పాలన వచ్చింది.రైతులకు,రుణమాపి,ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులు,మహిళలకు ఉచిత బస్సు,రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు,సన్నబియ్యం,ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతం తో ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగిస్తుంది. రాబోయే ఎన్నికల్లో ప్రజల దీవెనలతో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

