నేటి సాక్షి, అన్నమయ్య, శర్మ ~ చిత్తూరు జిల్లా :-: మదనపల్లి నియోజకవర్గ పరిధిలోని చిన్న తిప్ప సముద్రం కు చెందిన బంట్రోతు ఎర్రప్ప 65 అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మదనపల్లి మాజీ శాసనసభ్యులు దేశాయి తిప్పారెడ్డి, వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి లు సిటిఎం కు వెళ్లి ఎర్రప్ప స్వగృహానికి చేరుకొని పార్ధివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన కుమారుడికి ధైర్యం చెప్పి తీవ్ర దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదార్చి కుటుంబానికి అండగా వుంటామని అధైర్య పడొద్దని భరోసా కల్పించారు. చేదోడు వాదోడుగా ఉన్న ఎర్రప్ప మృతి చెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని దేశాయి తిప్పారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలు అన్నారు..~~~~~~~~~~~~~~~~~~

