నేటిసాక్షి, కరీంనగర్:తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా కరీంనగర్ కు చెందిన ప్రముఖ న్యాయవాది కూడలి శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ హైదరాబాద్‌లో శ్రీధర్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. శ్రీధర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్, లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, మాజీ హౌజ్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి మరియు కాంగ్రెస్ శ్రేణులకు న్యాయపరమైన సలహాలు, సహకారం అందించడంలో నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. శ్రీధర్ నియామకం పట్ల కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, న్యాయవాద మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

