నేటి సాక్షి, నారాయణపేట, డిసెంబర్ 29, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని పసుపుల గ్రామంలోని ప్రభుత్వ కస్తూర్బా గురుకుల పాఠశాలలో సోమవారం నాడు మరికల్ గ్రామ సర్పంచ్ చెన్నయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక దుస్తులను నిరుపేద విద్యార్థులకు పంపిణీ చేశారు. అదేవిధంగా పసుపుల గ్రామ సర్పంచ్ నర్మదా రవికుమార్ గౌడ్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వీరన్న, మరికల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరీష్ కుమార్, నాయకులు ఎల్.రాములు, నాగరాజు, బొంత మొగులయ్య,గోవర్ధన్, టైసన్ రాఘవేంద్ర,మంగలి రఘు, పసుపుల కస్తూర్బా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చెన్నయ్య మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి కస్తూర్బా పాఠశాల పేరును నిలబెట్టాలన్నారు.

