నేటి సాక్షి వికారాబాద్: గ్రామాలలో నూతనంగా గెలిచిన వార్డు సభ్యులు ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ జిల్లా నాయకులు వార్డు సభ్యులకు సన్మానించి సూచించారు. సోమవారం క్లబ్ హలు లో వికారాబాద్ నియోజక వర్గంలో నూతనంగా ఎన్నికైన సిపిఎం వార్డ్ ప్రజా ప్రతినిధులకు సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన గ్రామాల సీపీఎం వార్డు ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసి ప్రజల విశ్వాసాన్ని చురగొనాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలకు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో రాజి లేని పోరాటాలు నిర్వహించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అట్టడుగు పేదలను గుర్తించి అందరికీ సమన్యాయం జరిగే విధంగా చూడాలన్నారు.ఎంతో విశ్వాసంతో ఓట్లు వేసిన ప్రజల నమ్మకాన్ని వొమ్ము చేయకుండా ప్రజల హక్కులను కాపాడడంలో రాజీ లేని ఉద్యమాలు చేయాలని సూచించారు.గెలిచిన ఓడిన ప్రజల మధ్య ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాల అభివృద్ధి కోసం పోరాడాలని సూచించారు. భూస్వామ్య భావజాలం, ఆధిపత్య దొరణులతో ప్రజల మధ్య విద్వేష కులం, మతం ప్రాంతం పేర ఎన్ని అడ్డంకులు సృష్టించిన,ప్రజలను సంఘటితం చేసి స్వేచ్ఛయుత ప్రజాస్వామ్యనికి పునాదులు వేసిన చరిత్ర సీపీఎందే అని అన్నారు. ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఆపసహ్యం చేస్తున్న తరుణంలో సీపీఎం పోటీలో ఉండటమే కాకుండా, పోటీకి సిద్ధంగా ఉండే వారికి సైతం మద్దతుగా నిలిచామని అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రధాన బూర్జవా పార్టీలు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణి చేసినా ప్రజలు సీపీఎం ప్రజా సంఘాలు చేస్తున్న పోరాటాలను చూసి ఆదరించారని అన్నారు. జిల్లాలో అధికంగా ఎన్నికైన సర్పంచ్ లు వార్డు సభ్యులలో అధికంగా యువత ఉండటం మంచి పరిణామమని, ప్రజా సమస్యలపై అంకిత భావంతో పనిచేసి ప్రజా అభిమానం చూరగొనాలని సూచించారు. వికారాబాద్ మండల పరిధి ఎర్రవల్లి, జైదు పల్లి, ధరూర్ మండలం పరిధిలోని సోమారం, రుద్రారం మో మి న్ కలా న్ మోమిన్ కలాన్, మోమిన్ కుర్ద్ పరిధిలో వార్డులకు సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థులు పోటీ చేయగా 6 వార్డులలో గెలుపొందారని,వీరికి సన్మానం చెయ్యడము జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుదర్శన్, సతీష్ నవీన్,నాయకులు మహిళసంగం జిల్లా కార్యదర్శి అనసూయ, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి మహమ్మద్ అగ్బర్, కేవీపీస్ జిల్లా అధ్యక్షులు రాయల్ నవీన్ , జగన్న, యాదయ్య అలెండ్ శ్రీనివాస్ రాజు ప్రభాకర్ రాములు రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

