నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ జిల్లా ఎస్పి స్నేహ మెహ్ర ని కలిసిన వికారాబాద్ జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బృందం.అనంతరం పత్రిక మిత్రులతో మాట్లాడుతూ ఈ విధంగా స్పందించిన డాక్టర్ మెతుకు ఆనంద్ .బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులపైన వరుసగా జరుగుతున్న అక్రమాలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.సానుకూలంగా స్పందించిన ఎక్కడ తప్పు జరగకుండా చూసుకుంటామని, ఎవరైనా తప్పుగా వ్యవహరిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శింస్తూ బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన కేసులు పెట్టడం మానండి.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేదు.వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారు అని మాదగ్గర ఆధారాలు ఉన్నాయి.రాబోవు రోజుల్లో ఖచ్చితమైన సమయంలో ఆధారాలతో సహా అన్ని బయటపెడతాం.శివారెడ్డి పేట్ చెరువు కబ్జాకు గురి కాబోతుందన్న సమాచారం ఉంది. తొందర్లో శివారెడ్డి పెట్ చెరువును కూడా సందర్శిస్తాం. అలాగే కబ్జా వెనుకాల ఎవరి హస్తాలున్నాయి అనేది ఆధారాలతో సహా బయట పెడతాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటి గుర్తుంచుకోవాలి రాజకీయంలో స్నేహపూర్వక, సోదరభావాన్ని పెంపొందించుకొని ముందుకుసాగాలి. కాదు, కూడదు అని అతి చేస్తే భవిష్యత్తులో రాబోయేది బీ ఆర్ ఎస్ ప్రభుత్వమే అని గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో వడ్డీతో సహా మీకు తిరిగి చెల్లిస్తాం.కొంతమంది పోలీసులు కాంగ్రెస్ నాయకుల్లాగ వ్యవహరిస్తున్నారు. వారికి నేను హెచ్చరించేదొక్కటే భవిష్యత్తులో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అప్పుడు మీరు ఎక్కడున్నా ఏ కలుగులో ఉన్న బయటకు లాగి మరి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం గుర్తుంచుకోండి.

